హర్యానాలోని కైతాల్‌లో ఓ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న పలవురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దాంతో వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాలువలో నీళ్లు కొద్దిగా మాత్రమే ఉండటంతో పెనుముప్పు తప్పిందని అన్నారు.