స్కూల్‌ బస్సు బోల్తా .. 12మంది విద్యార్థులు సజీవదహనం

78చూసినవారు
స్కూల్‌ బస్సు బోల్తా .. 12మంది విద్యార్థులు సజీవదహనం
దక్షిణాఫ్రికా గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా పడి, మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సులో ఉన్న వారిలో 12 మంది విద్యార్థులతో పాటు డ్రైవర్‌ సజీవ దహనమయ్యారు. మరో ఏడుగురు పిల్లలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఏడుగురు చిన్నారుల్ని ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనతో పిల్లల కుటుంబాల్లో కన్నీటి ఛాయలు అలముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్