విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. ఇప్పటికే ఒంటిపూట బడులు, వేసవి సెలవుల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు హోలీ పండగ సెలవులు వచ్చాయి. ప్రభుత్వం హోలీ పండగ సందర్భంగా మార్చి 14 (శుక్రవారం) సెలవు ప్రకటించింది. అయితే 15న శనివారం కొన్ని పాఠశాలలు సెలవు ఇవ్వకపోయినా, కొన్ని పాఠశాలలు సెలవు ఇవ్వనున్నాయి. మార్చి 16 (ఆదివారం) సెలవు కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు లభించనున్నాయి.