TG: రాష్ట్రంలో స్కూళ్లు ప్రారంభం కావడంతో రవాణాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. వాహనాల ఫిట్‌నెస్‌పై గురువారం పలు జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, ఖైరతాబాద్, మలక్‌పేట్, బండ్లగూడలో 17, జనగామలో 3 ఫిట్‌నెస్ లేని బస్సులను సీజ్ చేశారు. కాగా రాష్ట్రంలో 6నేలకు పైగా బస్సులు ఫిట్నెస్ లేకుండా నడుస్తున్నాయని రవాణాశాఖ లెక్కలు చెబుతున్నాయి.