డివైడర్‌ను ఢీకొట్టి పల్టీకొట్టిన స్కార్పియో.. వీడియో వైరల్

0చూసినవారు
యూపీలోని ప్రయాగ్‌రాజ్ లో శుక్రవారం షాకింగ్ యాక్సిడెంట్ జరిగింది. గంగానగర్ జోన్‌లోని ఫుల్పూర్ పీఎస్ ప్రాంతంలో స్కార్పియో వాహనం మితిమీరిన వేగంతో వచ్చి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఓ భారీ ప్రకటన యూనిపోల్ హోర్డింగ్ కూడా కుప్పకూలింది. ఈ సంఘటన సంబంధించిన దృశ్యాలు సమీపంలోని CCTV కెమెరాలో రికార్డయ్యాయి. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్