పుదుచ్చేరిలో దారుణం జరిగింది. ఆరేళ్ల విద్యార్థినిపై ఓ ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు అతడిపై దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ కీచకుడిని తమకు అప్పగించాలంటూ గ్రామస్థులు చెన్నై-కడలూరు హైవేపై ఆందోళనకు దిగారు. అక్కడే ఉన్న రెండు వైన్స్ లను వారు ధ్వంసం చేశారు. కాగా ప్రస్తుతం ఆ ఉపాధ్యాయుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.