కేరళలో రెండో ఎంపాక్స్ కేసు నమోదైంది. ఎర్నాకుళం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి పరీక్షల్లో వైరస్ పాజిటివ్ వచ్చినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే, ఏ స్ట్రెయిన్ అనే విషయం ఇంకా నిర్ధారణ అవ్వలేదు. వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. సెప్టెంబరు 18న కేరళలోని మలప్పురంలో యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్ పాజిటివ్ గా తేలడంతో దేశంలోనే తొలి కేసు నమోదైంది.