జమిలీ ఎన్నికలపై ఈ నెల 31న జేపీసీ రెండో సమావేశం

54చూసినవారు
జమిలీ ఎన్నికలపై ఈ నెల 31న జేపీసీ రెండో సమావేశం
ఒకే దేశం-ఒకే ఎన్నిక ప్రతిపాదనలకు సంబంధించిన బిల్లులను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (JPC) రెండో సమావేశం ఈ నెల 31న జరుగనుంది. రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాలు (సవరణ) బిల్లులను గత శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లులను పరిశీలించాలని కమిటీకి సూచించారు. జేపీసీ తొలి సమావేశం ఈ నెల 8న జరిగిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్