తెలంగాణలో గురువారం మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాలు, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం MLC స్థానాలకు పోలింగ్ జరగనుంది. రేపు ఉ. 8 గంటల నుండి సా. 4గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద BNSS యాక్ట్ 144 సెక్షన్ అమలులో ఉంటుంది. 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయని, ఎవరైనా నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.