జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో భద్రతా బలగాలు మరోసారి అప్రమత్తమయ్యాయి. అక్కడ ఒక పొలంలో ఉన్న క్షిపణిని గుర్తించారు. తక్షణమే సురక్షితంగా నిర్వీర్యం చేశారు. పాకిస్తాన్ నుంచి మూడు రోజులపాటు రాజౌరి జిల్లాపై జరిగిన షెల్లింగ్ నేపథ్యంలో, భద్రతా బలగాలు ప్రాంతంలో విస్తృత తనిఖీలు చేపట్టగా ఈ క్షిపణి బయటపడింది. ప్రజల ప్రాణాలకు ఏ ముప్పు కలగకుండా భద్రతా బలగాలు పేల్చాయి.