ఆపరేషన్ సిందూర్ అనంతరం దేశంలోని ముఖ్య నేతలకు భద్రతను పెంచారు. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌కు కూడా భారీగా భద్రతను పెంచారు. భద్రతా ఏర్పాట్లలో ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ కారును ఏర్పాటు చేశారు. ఆయన నివాసం చుట్టూ కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జై శంకర్‌కు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కమాండోలతో Z కేటగిరీ భద్రత కొనసాగుతోంది. సుమారు 33 మంది కమాండోల బృందం రక్షణగా ఉంది.