ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు భద్రత పెంచాలని కాంగ్రెస్ నేతలు కోరారు. ప్రస్తుతం షర్మిలకు 2+2 గన్ మెన్స్ స్థానంలో 4+4 సెక్యూరిటీ కల్పించాలని వారు డీజీపీని కలిసి వినతిపత్రం అందించారు. ఇటీవల జగన్, షర్మిల మధ్య ఆస్తి వివాదాల నేపథ్యంలో ఆమెకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని.. అందుకే భద్రత పెంచాలని కాంగ్రెస్ నేతలు కోరినట్లు తెలుస్తోంది.