TG: వచ్చే శాసనసభ సమావేశాల్లోపు విత్తనచట్టం ముసాయిదాను సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కేటాయింపుల మేరకు ఎరువులు సరఫరా చేయకపోవడంపై ఎరువుల కంపెనీల ప్రతినిధులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని మండలాల్లో రైతుల అవసరాలకు తగ్గట్టు ఎరువులు ఉండేలా చర్యలు తీసుకోవాలని, వచ్చే నెలకు అవసరమయ్యే వాటిని కూడా ముందస్తుగానే జిల్లా కేంద్రంలో నిల్వ చేయాలని సూచించారు.