AP: వంటగదిలో నా తల్లి కన్నీళ్లు చూసి.. ఈ కష్టం మహిళలకు రాకూడదని ఆలోచించి ఆనాడే దీపం పథకం ప్రవేశ పెట్టానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్కాపురంలో నిర్వహించిన మహిళలతో ముఖాముఖిలో సీఎం మాట్లాడుతూ.. "మా తల్లి వంటగదిలో కట్టెల పొయ్యితో పడే కష్టాన్ని చూశాను. పొగ కారణంగా ఆమె కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేవి. ఆ కష్టం రాష్ట్రంలో ఏ మహిళా పడకూడదనే ఆనాడు దీపం పథకం తీసుకొచ్చా." అని అన్నారు.