కాంగ్రెస్ ప్రభుత్వంలో మాజీ ప్రభుత్వ ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఈ మేరకు ఓ రిటైర్డు పోలీస్ అధికారి పడుతున్న బాధను ట్విటర్‌లో కళ్లకు కట్టినట్లుగా వివరించారు. 30 ఏళ్లకు పైగా ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించిన రిటైర్డు పోలీస్ అధికారి ఠాగూర్ నారాయణ సింగ్‌కు రెండు కిడ్నీలు చెడిపోయి బాధపడుతున్నారు. మరోవైపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ అధికారి ఉండడం బాధాకరమని పేర్కొన్నారు.