'రైతు బంధు'ను శాశ్వతంగా రద్దు చేయాలని చూస్తున్నారు: హరీశ్ రావు

82చూసినవారు
'రైతు బంధు'ను శాశ్వతంగా రద్దు చేయాలని చూస్తున్నారు: హరీశ్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని చూస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. 'రైతుబంధు కంటే సన్నాలకిచ్చే రూ.500 బోనసే మేలు అని రైతులు అంటున్నట్లు మంత్రి తుమ్మల చెబుతున్నారు. 5,19,605 క్వింటాళ్ల సన్న వడ్లకు దక్కిన బోనస్ రూ.26 కోట్లు. అదే రైతుబంధు కింద ఏడాదికి రూ.7500 కోట్లు రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. మరి రైతుబంధు కంటే బోనస్ అందించడం రైతులకు మేలు ఎలా అవుతుంది?' అని ప్రశ్నించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్