తెలంగాణ ఉద్యోగుల సర్వీస్ అంశాల్లో ఎదురవుతున్న సమస్యలకు సత్వర పరిష్కారాన్ని చూపేందుకు ఆన్ లైన్ విధానం తీసుకొస్తున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెల 24న తొలి సమావేశానికి మంత్రి సీతక్క హాజరు కానున్నట్టు చెప్పారు. ఉద్యోగుల సమస్యలు, సర్వీస్ అంశాల పరిష్కారానికి ప్రతి నెల రెండో, నాలుగో శుక్ర వారాల్లో మధ్యాహ్నం 3-4 గంటల వరకు ఆన్లైన్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. పంచాయతీ రాజ్ శాఖ ఇచ్చే వెబ్ లింక్ ద్వారా జాయిన్ అవ్వాలన్నారు.