చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. అలాంటి ఘటనే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో చోటుచేసుకుంది. పద్మనగర్ గ్రామానికి చెందిన నాగిషెట్టి ప్రసాద్ (35) అనే శనివారం ఉదయం వాకింగ్ వెళ్లాడు. మార్నింగ్ వాక్ చేస్తూ సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాడు. అప్పుడే గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.