తెలంగాణలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రీజినల్ రింగ్ రోడ్డు (RRR) భూసేకరణలో పురోగతిపై ఆరా తీశారు. మంచిర్యాల-వరంగల్-ఖమ్మం-విజయవాడ కారిడార్ భూసేకరణ వివరాలు నెలాఖరులోగా పంపాలని ఆయా జిల్లాల కలెక్టర్లను సీఎం రేవంత్ ఆదేశించారు.