పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు

76చూసినవారు
పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
కార్గిల్ యుద్ధం జరిగిన 25 ఏళ్ల తరువాత పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ (ఎన్‌) పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్గిల్ యుద్ధం తాలూకు పాపం మేమె చేశామని కుండ బద్దలు కొట్టారు. 1999లో లాహోర్ వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య శాంతి ఒప్పందంపై నాటి ప్రధాని అటల్ బిహారీ, తాను కూడా సంతకాలు చేశామని గుర్తు చేశారు. అయినా, తాము ‘లాహోర్ డిక్లరేషన్’ ఉల్లంఘించామని నవాజ్ షరీఫ్ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్