మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. హనీమూన్ ట్రిప్‌కు నిందితురాలు సోనమ్ టికెట్లు బుక్ చేసిందని, కానీ రిటర్న్ టికెట్లు మాత్రం బుక్ చేయలేదని మృతుడు రఘువంశీ తల్లి ఉమ తెలిపారు. ట్రిప్‌కు వెళ్లే సమయంలో గోల్డ్ ధరించి రావాలని తన కుమారుడికి సోనమ్ చెప్పడం వల్ల రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు తీసుకెళ్లాడని చెప్పారు. తన కుమారుడిని చంపిన సోనమ్‌ను ఉరి తీయాలని డిమాండ్ చేశారు.