APలో డిప్యూటీ కలెక్టర్‌ను MROగా డిమోట్ చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తమ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని DC మోహన్ రావుకు AP హైకోర్టు గతంలో 2 నెలల జైలు శిక్ష, రూ.2000ల జరిమానా విధిస్తూ 2015 మార్చి 27న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ఆయన SCలో సవాల్ చేయగా విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అధికారులు చట్టానికి అతీతులు కాదని, AP HC ఆదేశాల ఉల్లంఘనపై ఏ జైలుకు పంపాలో ఆయనే నిర్ణయించుకోవాలంది.