దాదాపు 50కి పైగా హత్య కేసుల్లో దోషిగా తేలిన సీరియల్ కిల్లర్ ఆయుర్వేద వైద్యుడు దేవేందర్ శర్మ(67) అనేకమంది ట్యాక్సీ, ట్రక్కు డ్రైవర్లను అతి కిరాతకంగా చంపేసి వారిని మొసళ్లకు ఆహారంగా పడేసేవాడు. తిహాడ్ జైలు నుంచి పెరోల్‌పై బయటకు వచ్చి అదృశ్యమైన దేవేందర్.. రాజస్థాన్‌లోని ఆశ్రమంలో మారువేషంలో ఉండగా పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. డ్రైవర్లను హతమార్చి, ఆ తర్వాత ఆ వాహనాలను విక్రయించేవారని పోలీసులు తెలిపారు.