తెలంగాణలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం చెందారు. ఆదిలాబాద్(D) మేకలగండి వద్ద జాతీయ రహదారి-44పై అర్ధరాత్రి డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా పడడంతో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సాయంత్రం సూర్యాపేట(D) సీతారామపురం వద్ద బైక్ ను లారీని ఢీ కొట్టడంతో ముగ్గురు యువకులు చనిపోయారు.