అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఊటుకూరు సచివాలయం వద్ద లారీ-ఐషర్ వాహనం ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు నుజ్జు నుజ్జయ్యాయి. ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.