కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలవుతున్నా సర్పంచుల సమస్యలు పరిష్కరించలేదని రాష్ట్ర సర్పంచుల జేఏసీ అధ్యక్షుడు యాదయ్య గౌడ్ అన్నారు. 2019-24 మధ్య పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే పెండిగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించాలంటూ జేఏసీ సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చింది. సచివాలయంవైపు ర్యాలీగా వెళ్తున్న సర్పంచులను అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.