తెలుగు ప్రజలపై మమకారంతోనే సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు నటుడు సోనూసూద్ తెలిపారు. ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో సోనూసూద్ ఏపీకి నాలుగు అంబులెన్సులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని, ప్రజలకు సేవా చేయడమే తన ధ్యేయమన్నారు.