మధ్యప్రదేశ్ లోని ఉమారియా జిల్లాలో ఉన్న బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ లో ఏడు అడవి ఏనుగులు మరణించినట్లు అక్కడి అటవీశాఖ అధికారి వెల్లడించారు. మంగళవారం నాలుగు ఏనుగులు చనిపోగా.. బుధవారం ఉదయం మరో మూడు ఏనుగుల మృతి చెందినట్లు తెలిపారు. 13ఏనుగుల సమూహంలో ఏడు మృతి చెందగా.. మరో రెండు ఏనుగులు చికిత్స పొందుతున్నాయని పేర్కొన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే ఏనుగుల మృతికి గల కారణాలు తెలుస్తాయని అధికారులు వెల్లడించారు.