హాకీ శిక్షణ పేరుతో బాలికపై లైంగిక దాడి

58చూసినవారు
హాకీ శిక్షణ పేరుతో బాలికపై లైంగిక దాడి
AP: అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్టణంలోని ఉలక్‌పేటకు చెందిన మళ్ల రూపేష్ సీనియర్ హాకీ క్రీడాకారుడు. జూనియర్లకు శిక్షణ ఇస్తుంటాడు. ఈ క్రమంలో గాంధీనగర్‌కు చెందిన 8వ తరగతి చదువుతున్న బాలిక (13)ను హాకీ ఆటలో శిక్షణ ఇస్తానంటూ మభ్యపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లి నిలదీయడంతో జరిగిన దారుణాన్ని చెప్పింది. దాంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి రూపేష్‌ను అరెస్ట్ చేశారు. కోర్టు ముందు హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు.

సంబంధిత పోస్ట్