తెలంగాణలోని ప్రముఖ శక్తి పుణ్యక్షేత్రాల్లో ఒకటైన వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చిన భక్తులు.. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం 'భద్రకాళీ శరణం మమ' అనే నామస్మరణతో మార్మోగింది. భక్తులు పెద్ద ఎత్తున దేవాలయానికి పోటెత్తుతున్నారు.