భారత్ - ఇంగ్లాండ్ మధ్య రేపు మూడో టీ20 జరుగనుంది. అయితే ఈ సిరీస్ కోసం జట్టులోకి వచ్చిన పేస్ బౌలర్ మహ్మద్ షమీని తొలి రెండు మ్యాచ్‌లకు తీసుకోకపోవడంతో అతడు పూర్తి ఫిట్‌గా ఉన్నాడా లేదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ, తాజాగా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ మాత్రం అతడు ఫిట్‌గా ఉన్నట్లు స్పష్టం చేశాడు. అతన్ని ఆడించడానికి ఫిట్‌నెస్ సమస్య కాదని పేర్కొన్నాడు. అయితే, కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యలదే తుది నిర్ణయమని తెలిపాడు.