మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు షాక్ తగిలింది. ఆయనపై ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు మంగళవారం నిరాకరించింది. వైద్య కారణాల రీత్యా తనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని సత్యేంద్ర జైన్ కోరారు. అయినప్పటికీ కోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది.