బీహార్‌లో ఎన్టీఏ కూటమికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు గట్టి షాక్ తగిలింది. ఎన్డీఏ మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ ఎన్టీఏ కూటమికి గుడ్ బై చెప్పింది. ఈ విషయాన్ని కేంద్ర మాజీ మంత్రి పశుపతి కుమార్ పరాస్ ప్రకటించారు. కూటమి నుంచి పూర్తిగా వైదొలుగుతున్నామని, ఇకపై కూటమితో మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. దళితులకు ఎలాంటి న్యాయం చేయకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు.