భవనం కూల్చేస్తుండగా షాక్.. వైరల్ వీడియో

33943చూసినవారు
టెక్నాలజీ పుణ్యమా అని బహుళ అంతస్తుల భవనాలను కూల్చేందుకు కొన్ని క్షణాలు చాలు. అయితే, పక్కనున్న భవనాలపై పడకుండా ఉన్న చోటే కుప్పకూలేలా ప్లాన్ చేస్తారు. తాజాగా, కర్ణాటకలో ఓ భవనం కూల్చివేతలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఓ భవనాన్ని కూల్చేందుకు యత్నించగా అది పక్కకు ఒరిగిపోయింది. ఈ క్రమంలో స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి.

ట్యాగ్స్ :