యూపీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హర్దోయ్ నగర కేంద్రంలో ఆవాస్ వికాస్ కాలనీలోని బాబా సామి స్వీట్ షాపులో.. ఓ కస్టమర్ స్వీట్‌ను కొన్నాడు. దానిని తింటుండగా సదరు కస్టమర్‌కు స్వీట్‌లో చనిపోయిన ఈగ కనపడింది. దీంతో అతను షాక్‌కు గురై.. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేశాడు. అధికారులు స్పందించి ఆ షాపుపై చర్యలు తీసుకోవాలని, తనకు తగిన న్యాయం చేయాలని ఆ కస్టమర్ కోరాడు.