తమిళనాడులోని కాలేజీ బాత్‌రూమ్‌లో పాములు ప్రత్యక్షమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తిరువణ్ణామలైలోని అరిగ్నర్ అన్నా కాలేజీలోని మహిళల టాయిలెట్‌లో పదుల సంఖ్యలో పాములు కనిపించాయి. ఇది చూసిన విద్యార్థులు నివ్వెరపోయారు. ఈ కళాశాలలో దాదాపు 8,500 మంది విద్యార్థులు చదువుతున్నారు.