జ్యూస్‌లో మూత్రం కలుపుతున్న షాపు ఓనర్లు.. చితక్కొట్టిన కస్టమర్లు (వీడియో)
యూపీలోని ఘజియాబాద్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ జ్యూస్ షాపులో కస్టమర్లకు నిర్వాహకులు జ్యూస్‌లో మూత్రం కలిపి ఇస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు దుకాణంలో తనిఖీలు నిర్వహించారు. షాపులో లీటర్ మూత్రం పట్టుబడింది. దీంతో కస్టమర్లలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. షాపు నిర్వాహకులు అమీర్, కైఫ్‌లపై వారు దాడి చేశారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.