సర్కారీ బడుల్లో ఉపాధ్యాయుల కొరత

61చూసినవారు
సర్కారీ బడుల్లో ఉపాధ్యాయుల కొరత
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగటం, ఉపాధ్యాయుల పదవీ విరమణలు.. కొత్త నియామకాలు లేకపోవడంతో బోధించేవారు కరవయ్యారు. ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు అధికారులు ఒకే మాధ్యమం విధానాన్ని తీసుకొస్తున్నారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమంతో సంబంధం లేకుండా ప్రాథమిక పాఠశాలల్లో 30, ఉన్నత పాఠశాలల్లో 40 మంది పిల్లలకు ఒకరు చొప్పున ఉపాధ్యాయులను కేటాయిస్తున్నారు. టీచర్లు, గదుల కొరత కారణంగా కొన్నిచోట్ల పిల్లలు ఒకే గదిలో కిక్కిరిసి కూర్చోవాల్సి వస్తోంది.

సంబంధిత పోస్ట్