పాక్ భారత్‌పై అణ్వాయుధాలతో దాడి చేస్తామని బెదిరింపులు చేస్తున్నా.. వారి వద్ద మందుగుండు సామగ్రి తగ్గిపోతున్నట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఒప్పందం ప్రకారం పాకిస్థాన్ కొన్ని ఆయుధాలను ఉక్రెయిన్‌కు సరఫరా చేసినట్టు తెలుస్తోంది. భారత్‌తో పోరాటానికి ఫిరంగులు, సైనికులే ఆశ్రయంగా మారాయని సమాచారం. దీనిపై పాక్ సైనిక నాయకత్వం ఆందోళన చెందుతోందని వెల్లడవుతోంది.