మహారాష్ట్ర బద్లాపుర్‌లో చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
వరుస లైంగిక వేధింపుల ఘటనలు.. ఒక సమాజంగా మనం ఎటు పయనిస్తున్నామో ఆలోచించేలా చేస్తున్నాయి. బద్లాపుర్ ఘటనలో న్యాయం కోరుతూ ప్రజలు రోడ్లపైకి వచ్చేవరకు చర్యలు తీసుకోలేదు. FIR నమోదుకు ఆందోళనలు చేయాలా? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. న్యాయం అనేది ప్రతి పౌరుడి హక్కు అని పేర్కొన్నారు.