భారత క్రికెట్ జట్టు కోచ్‌గా ఎంపికైన గౌతం గంభీర్ బీసీసీఐకి వరుస షరతులు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అసిస్టెంట్ కోచ్‌గా అభిషేక్ నాయర్‌ను ఎంపిక చేయాలన్న గౌతీ ఇప్పుడు నెదర్లాండ్స్ మాజీ క్రికెటర్ టెన్ డెస్కాటేను సపోర్ట్ స్టాఫ్‌గా తీసుకోవాలని కోరారట. ఈ ముగ్గురూ కేకేఆర్‌కి చెందిన వారే కావడం గమనార్హం. ఇటీవల ఎక్కువగా స్వదేశీ కోచ్‌లకే ప్రాధాన్యమిస్తున్న బీసీసీఐ ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.