ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించాలా.. వాట్సప్‌ బాట్‌ ఉందిగా

84చూసినవారు
ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించాలా.. వాట్సప్‌ బాట్‌ ఉందిగా
పాలసీదారులు సులభంగా ప్రీమియం చెల్లించేందుకు వీలుగా LIC సరికొత్త వాట్సప్‌ సేవను ప్రవేశపెట్టింది. ఈ సేవ కోసం 8976862090 అనే ప్రత్యేక నంబరును కేటాయించింది. LIC పోర్టల్‌లో నమోదు చేసుకున్న పాలసీదారులు ఈ నంబరుకు ‘హాయ్‌’ అని సందేశం పంపితే, తమ పాలసీలకు సంబంధించి ప్రీమియం వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే UPI, నెట్‌ బ్యాంకింగ్‌, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా నేరుగా వాట్సప్‌ బాట్‌లోనే చెల్లింపులు చేయవచ్చు.

సంబంధిత పోస్ట్