ప్రధాని మోదీ అమెరికాలో టెక్సాస్ రాష్ట్రాన్ని కుదిపేసిన వరదలపై స్పందించి, అక్కడ చనిపోయిన వారికి సంతాపం ప్రకటించారు. అమెరికా ప్రభుత్వానికి, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ ట్వీట్‌ను మోదీ 22 గంటల క్రితమే షేర్ చేశారు. అయితే అదే సమయంలో, మన దేశం హిమాచల్ ప్రదేశ్‌లో వరదలతో 74 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై మోదీ ఎందుకు స్పందించలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఐదు రోజుల క్రితమే విపరీతమైన వర్షాలతో భారీ నష్టం జరిగినా ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.