AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు HYDలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. వంశీ అరెస్ట్ అయినప్పటి నుంచి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అజ్ఞాతంలోకి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో నెక్స్ట్ అరెస్ట్ నానిదే ప్రచారం జరుగుతోంది. గతంలో ఈ ఇద్దరు నేతలు టీడీపీలోనే ఉన్నారు. అయితే.. 2014 ఎన్నికల కన్నా ముందు కొడాలి నాని వైసీపీలో చేరారు. అయితే వైసీపీ హయాంలో నాని కీలక పాత్ర పోషించారు.