TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇష్యూ క్లైమాక్స్‌కు చేరుతోంది. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు తప్పదా.. అంటే దాదాపు అవుననే అంటున్నారు న్యాయ నిపుణులు. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సీరియస్ గా ఉన్న నేపథ్యంలో, స్పీకర్ జాప్యాన్ని ప్రశ్నిస్తున్న వేళ.. ఇక ఎంతో దూరం దీన్ని లాక్కెళ్లలేరని చెబుతున్నారు. ఇప్పటికే పది నెలలైనా దృష్ట్యా నిర్ణయం వెలువరించక తప్పదంటున్నారు.