AP: చెప్పిన 31 హామీలు అమలు చేయలేకపోతే కాలర్ పట్టుకుని నిలదీయమని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఎన్నికల ముందు అన్నారని, ఇప్పుడు అదే మాటకి కట్టుబడి ఉన్నారా అని వైసీపీ ప్రశ్నించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా హామీలు అమలు చేయలేకపోయారని విమర్శిచింది. ఇప్పుడు ప్రజలు వచ్చి మీ కాలర్ని పట్టుకోమంటారా అని తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది.