ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కులగణన నివేదికను కాల్చివేయడంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పీసీసీ చీఫ్‌తో చర్చించిన తర్వాత తీన్మార్ మల్లన్నపై క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకున్నది. సీఎల్పీ సమావేశం వెంటనే తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షో కాజ్ నోటీసులు జారీచేసింది.