2025 మార్చి నెలకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ గెలుచుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో టీమ్ ఇండియాను విజయం వైపు నడిపించాడు. అయన మొత్తం 243 పరుగులు చేసి అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ముఖ్యంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలపై కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. తన అవార్డు గెలుపు దేశానికి అంకితం చేస్తున్నానని, ఈ గౌరవం ఎంతో ప్రత్యేకమని అయ్యర్ హర్షం వ్యక్తం చేశాడు.