యాక్సియం-4 మిషన్‌లో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్రకు సిద్ధమవుతున్నారు. బుధవారం సాయంత్రం 5:30 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ఈ మిషన్ కింద మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి శుభాంశు మంగళవారం పయనం కావాల్సి ఉంది. అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఉన్న ఫ్లోరిడా ప్రాంతంలో వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో బుధవారానికి వాయిదా వేశారు. భూమి నుంచి బయల్దేరిన 28 గంటల తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)తో ఈ వ్యోమనౌక అనుసంధానమవుతుంది.