కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న మరణాలకు కొవిడ్ టీకాలే కారణమని సీఎం సిద్దరామయ్య ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు నిజం కాదని, దానికి ఎలాంటి ఆధారాలు లేవని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణల కమిటీ స్పష్టం చేసింది. దీంతో సీఎం సిద్ధరామయ్య రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఇటీవల హసన్ జిల్లాలో 20 మంది గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.